'వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉపాధి కోల్పోయి దుర్భర జీవితం గడుపుతున్నాం' - Skill Development Teachers Protest - SKILL DEVELOPMENT TEACHERS PROTEST
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 29, 2024, 3:48 PM IST
Skill Development Teachers At CM Chandrababu House : గత తెలుగుదేశం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఇచ్చిన ఉద్యోగాలను వైఎస్సార్సీపీ సర్కారు తొలగించిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. పని చేయించుకున్న కాలానికి కూడా వేతనాలు ఇవ్వకుండా నరకం చూపిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేసిన తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉఫాధి కోల్పోయి దుర్భర జీవితం గడుపుతున్నామని వాపోయారు. తమ బాధలు విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదుకుంటామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. హామీలు వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం నివాసానికి బాధితులు పెద్ద ఎత్తున వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ పాఠశాలల్లో గత 5ఏళ్లుగా విద్యార్థులకు సరైన నైపుణ్య శిక్షణ లేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.