కర్నూలులో సీతారాం సిత్రాలు చిత్ర బృందం సందడి - Sitaram Sitralu Movie

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 12:45 PM IST

thumbnail
కర్నూలులో సందడి చేసిన సీతారాం సిత్రాలు చిత్ర బృందం (ETV Bharat)

Sitaram Sitralu Movie Pre Release Event in Kurnool District : కర్నూలు జిల్లాలో సీతారాం సిత్రాలు చిత్ర బృందం సందడి చేసింది. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్​లో సీతారాం సిత్రాలు ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ముఖ్య అతిధులు పాల్గొన్నారు. సీతారాం సిత్రాలు సినిమాలో హీరోగా నటించిన లక్ష్మణ్, డైరెక్టర్ నాగ శశిధర్ రెడ్డి, నిర్మాతలు చంద్రశేఖర్, నాగేశ్వరరావు కర్నూలు ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్​గా నూతన నటి భ్రమరాంబిక నటించింది. 

ఆగస్టు 30న సీతారాం సిత్రాలు సినిమా విడుదల అవుతుందని చిత్రబృందం తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కళాకారుల ప్రతిభ వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. కళాకారులకు తమ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సినిమాను విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.