అధికార పార్టీ అండదండలు- సింహాచలం దేవస్థానం భూమిలో అక్రమార్కుల పాగా - ysrcp leaders land grabbing

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 2:22 PM IST

Simhachalam Temple Land Encroachment: రాష్ట్రంలో భూ ఆక్రమణలు ఇష్టారీతిన జరుగుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ నేతల అండదండలు తోడవడంతో అడ్డొచ్చిన వారిని భయపెడుతున్నారు. అది దేవాలయ భూమి అయినా సరే కన్నుపడితే వారి సొంతం అవ్వాల్సిందే. భూ కబ్జాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఇలా ఆక్రమణలకు తెరలేపడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

తాజాగా విశాఖలో వైసీపీ అండదండలతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. విశాఖ 45వ వార్డు నరసింహనగర్‌ సమీప గణేష్‌ నగర్‌లో 500 గజాల ఖాళీ స్థలాన్ని కబ్జాకు యత్నించారు. సింహాచలం దేవస్థాన భూమిలో అక్రమార్కులు పాగా వేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధాలు ఉన్నప్పటికీ వైసీపీ నేతల అండతో పొక్లెయిన్​తో కొండను చదును చేశారు. వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం, దర్జాగా కబ్జాల పర్వమని ప్రజలు విమర్శిస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను బెదిరింపులకు గురి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.