LIVE: ఆలయాల్లో శివరాత్రి వేడుకలు - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 6:27 AM IST

Updated : Mar 8, 2024, 9:56 AM IST

thumbnail

Mahashivaratri Live : మహా శివరాత్రిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ముక్కంటిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరటంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ క్షేత్రాలు, ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. యాదాద్రి మహాపుణ్యక్షేత్రంలో అనుబంధంగా కొనసాగుతున్న శ్రీశ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని విద్యుత్తుకాంతులతో ముస్తాబు చేశారు.  తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఐనవోలుకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్ నుంచి ప్రముఖ శైవ క్షేత్రాలు కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శివుణ్ణి ఆరాధించే కోట్లాది మంది భక్తులకు శివరాత్రి అత్యంత ప్రాధాన్యమైన రోజుగా పేర్కొన్న గవర్నర్.. ఈ రోజు చేసే జాగరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఈ పండుగ ప్రజలలో ప్రేమ, అభిమానం, సహనం, సోదరభావం పెంపొందిస్తుందని ఆకాంక్షించారు.

Last Updated : Mar 8, 2024, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.