దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్నకు సారె - Srisailam Mallanna Temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 1:47 PM IST

Shivaratri Celebration Arrangements In Srisailam Mallanna Temple : మహాశివరాత్రిని పురస్కరించుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి సారె సమర్పించారు. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామ దేవస్థానం తరపున శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలను సంప్రదాయంగా దుర్గగుడ పాలకమండలి ఛైర్మన్, ఈవో, ఇతర పాలకమండలి సభ్యులు బృందంగా శ్రీశైలానికి (Srisailam) తీసుకెళ్లారు. స్వామివార్ల దేవస్థానం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి శేషవస్త్రం, తీర్థ, ప్రసాదాలు అందించారు. 

Maha Shivaratri Celebrations at Srisailam Temple : ప్రతి ఏటా శివరాత్రి ముందు ఇంద్రకీలాద్రి నుంచి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే శివరాత్రి (Shivaratri)  వేడుకలకు  అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈఓ తెలిపారు. భక్తులను (Devotees) దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నిర్వహించినట్టే ఈ సారీ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.