ఓటరు జాబితాలో అవకతవకలపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు - ఓటరు అవకతవకలపై ఈసీకి షరీఫ్ ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 9:23 AM IST
Sharif Complained to Election Commission Irregularities in Voter List: తుది ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జాబితాలో ఇంకా లోపాలు ఉన్నాయని తక్షణమే తప్పుల్ని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నెంబర్లు తప్పులున్నాయని పేర్కొన్నారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించకపోగా వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లున్నాయని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఒకే డోర్ నెంబర్‌తో వందలాది ఓట్లు నమోదయ్యాయని షరీఫ్ అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా స్థానికంగా లేరంటూ వేలాది ఓట్లు తొలగించారని విమర్శించారు. జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలను లేఖకు జత చేశారు. ఓటర్ జాబితా తప్పిదాలపై సాక్ష్యాధారాలు, వార్తా కథనాలను అందించారు. తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలని, ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కుల్ని కాపాడాలని ప్రధాన ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల ఓటరు జాబితలో ఊరిలో లేని వారు పేర్లు, చనిపోయిన వారివి ఇంకా జాబితాలో కొనసాగుతున్నాయి. ఒకే ఇంటి నెెంబర్తో వందల ఓట్లు ఉంటున్నాయి. వీటన్నింటిపై ఎన్నికల కమీషన్ మరోసారి పరిశీలించి ఓటరు జాబితాను వెల్లడించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.