పుష్ప సినిమా తరహాలో మద్యం తరలింపు -వీడి తెలివి చూసి సుకుమార్ మరో సినిమా తీయోచ్చు ! - SEB police seized Karnataka liquor - SEB POLICE SEIZED KARNATAKA LIQUOR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 10:41 PM IST
|Updated : Apr 6, 2024, 10:48 AM IST
SEB Police Seized Karnataka Liquor: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కర్నూలు జిల్లా కోడుమూరు వెళ్లే రహదారిలో పెద్ద మొత్తంలో కర్ణాటక మద్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా మారుతి సుజుకి సూపర్ క్యారియర్ వాహనంలో సెపరేట్గా అరను ఏర్పాటు చేసి, అందులో దాచి ఉంచిన 33 కార్టూన్ బాక్సులలోని 3168 మద్యం టెట్రా ప్యాకెట్లను పట్టుకున్నారు. వీటిని కర్ణాటక రాష్ట్రం నుంచి రవాణా చేస్తున్నట్లు సెబ్ పోలీసులు తెలిపారు.
మద్యం తరలింపు కోసం ప్రత్యేక అర: మద్యం తరలింపు కోసం ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఖాళీ టమాటా బాక్సులు తరలిస్తున్నారు. ఇందుకోసం వాహనంలో ప్రత్యేకంగా అరను ఏర్పాటు చేశారు. పోలీసుల తనిఖీ సమయంలో అనుమానం రాకుండా మద్యం తరలించేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమ మద్యాన్ని తరలిస్తున్న రాయచూరు జిల్లా కడగందొడ్డి గ్రామానికి చెందిన హరీష్ గౌడ్ అనే వ్యక్తిని కోడుమూరు సెబ్ (Special Enforcement Bureau) పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. మద్యం విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.