వైసీపీ నేత ఇంట్లో కర్ణాటక మద్యం - టెట్రా ప్యాకెట్లు పట్టుకున్న సెబ్ అధికారులు - సెబ్ అధికారులు మద్యం స్వాధీనం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 2:47 PM IST
SEB Officers Seized Illegal Karnataka Liquor in Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామంలో బోయ నరసింహులు ఇంటిలో కర్ణాటక మద్యం అక్రమంగా దాచి పెట్టారన్న సమాచారంతో అనంతపురం సెబ్ ఇంటిలిజెన్స్ అధికారులు సంయుక్తంగా గురువారం దాడి చేశారు. అక్కడ 35 పెట్టెల్లో నిల్వ ఉంచిన 3,360 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.1.80 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Heavy Liquor is Brought From Karnataka Sold in Villages: కర్ణాటక నుంచి భారీగా మద్యం తెచ్చి గ్రామాల్లో విక్రయిస్తున్నాడన్న సమాచారంతోనే దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మద్యం ప్యాకెట్లు నిల్వ ఉంచిన వ్యక్తి వైసీపీ మద్దతుదారు అని తెలియటంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నరసింహులుకు ఇంత పెద్ద స్థాయిలో ఎవరు మద్యం సరఫరా చేశారో, అతని వెనక ఎవరు ఉన్నారని ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకుడిని కూడా సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను ఉరవకొండ సెబ్ కార్యాలయం వద్ద వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు మురళీ తదితరులు పాల్గొన్నారు.