కన్నీరు పెట్టుకున్న సర్పంచ్‌ - వైసీపీ హయాంలో అభివృద్ధి చేయలేకపోయామని ఆవేదన - Sarpanch Emotional in Grama Sabha - SARPANCH EMOTIONAL IN GRAMA SABHA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 10:46 PM IST

Sarpanch Sirisha Emotional in Grama Sabha: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో సర్పంచ్‌ అల్లంపల్లి శిరీష భావోద్వేగానికి గురయ్యారు. సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన మాకవరపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్‌ అల్లంపల్లి శిరీష వైఎస్సార్సీపీ పాలనలో పంచాయతీకి ఒక్క పైసా పని చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలకు ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామన్నారు. కూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, అయ్యన్నపాత్రుడకు కృతజ్ఞతలు తెలిపారు. 

కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తైనా చాలా మంది ఉద్యోగులు వైఎస్సార్సీపీ జ్ఞాపకాలను, అనుభవాలను విస్మరించలేకపోతున్నారని స్పీకర్​ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఉపాధి పనుల గుర్తింపులో భాగంగా గ్రామాలను అన్ని కోణాల్లో అభివృద్ధి చేసుకోవాలని అయ్యన్నపాత్రుడు కోరారు. మాగవరపాలెం మండలంలోని అన్ని పంచాయితీల పరిధిలో ఉన్న స్మశానాల అభివృద్ధికి 10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.