టీడీపీ ప్రభుత్వమొచ్చినా కొనసాగుతున్న అక్రమంగా ఇసుక తవ్వకాలు-16 టిప్పర్లు సీజ్ - 16 lorries seized smuggling sand - 16 LORRIES SEIZED SMUGGLING SAND
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 4:02 PM IST
|Updated : Jun 24, 2024, 4:22 PM IST
Sand Mafia In Anantapur District Police Seized 16 vehicles : అనంతపురం జిల్లా పామిడి సమిపంలోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 16 టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. వారం రోజులుగా రోజూ వంద టిప్పర్ల ఇసుక బెంగుళూరుకు తరలిపోతోంది. విచ్చలవిడిగా తవ్వేసి ఇసక దోపిడీ జరుగుతున్నా, గతంలో పని చేసిన తరహాలోనే పోలీసులు ఇసుకాసురులకు కొమ్ముకాస్తున్నారు. దీంతో ఇసుక దోపిడీపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఒత్తిడితో పెద్దవడుగూరు, పామిడి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇసుక లోడుతో వెళ్తున్న 16 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది టిప్పర్లను పామిడి ఠాణాలో, ఏడు టిప్పర్లను పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇసుకాసురులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ పాలనలో ఇసుక మాఫియా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే తెలిసిందే. ఇప్పుడూ యధేచ్ఛగా జరుగుతున్న ఇసుక మాఫియాను అరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.