ఓటు వేయండి - ఫ్రీగా కటింగ్ చేయించుకోండి: సెలూన్ యజమాని బంపరాఫర్ - free haircut on voting in vizag - FREE HAIRCUT ON VOTING IN VIZAG
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 10:56 AM IST
Free Haircut on Voting in Vizag : ఓటు వేయడానికి కొందరు చూపే అలసత్వం ఓ వృత్తి నిపుణుడుని ఆలోచింపజేసింది. ఓటు వేయడానికి ఆసక్తిగా వెళ్లేందుకు తానేమి చేయవచ్చన్న దానిపై తర్జనభర్జన పడ్డాడు ఆ యువకుడు. తాను నడుపుతున్న సెలూన్ నుంచి తన పరిధిలో ఒక ప్రోత్సాహకాన్ని ఓటు వేసే వారికి అందించాలని అనుకున్నాడు. ఓటు వేయడం ద్వారా తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే విధంగా ఓటర్లను చైతన్యవంతం చేయడానికి మల్లు వలస రాధాకృష్ణ నిర్ణయించుకున్నాడు.
Free Hair Cutting for Vishaka Voters : ఓటును అందురూ వినియోగించుకునే విధంగా విశాఖ జిల్లా కంచెరపాలెంకు చెందిన ఆర్కే స్మార్ట్ ది సెలూన్ యాజమాని మల్లు వలస రాధాకృష్ణ విన్నూత ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13న ఓటు వేసి వచ్చిన వారికి ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తామని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టాడు. ఈనెల 13న ఓటు వేసి వచ్చిన వారికి ఈ సేవను ఉచితంగా అందిస్తానని తెలిపారు. ఓటు వేయడం ద్వారా తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే ఆవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని రాధాకృష్ణ కోరారు.