పనిచేసే ఆఫీస్‌లోనే సమాచార కమిషనర్ల రచ్చరచ్చ - RTI Officers Argument - RTI OFFICERS ARGUMENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-09-2024/640-480-22551404-thumbnail-16x9-rti-officers-argument-with-government-employee.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 4:02 PM IST
RTI Officers Argument with Government Employee : రాష్ట్ర ఆర్టీఐ కార్యాలయంలో సమాచార కమిషనర్లు రచ్చరచ్చ చేశారు. ఆర్టీఐ కమిషనర్లు రోజూ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సి ఉంది. అయితే వారెవరూ అలా చేయకపోవడంతో వారికి జీతాలు ఇవ్వలేదు. వేతనాలు చెల్లించకపోవడంపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యాలయానికి వచ్చి ప్రభుత్వ సూపరింటెండెంట్‌పై చిందులేశారు. ఉద్యోగి, ఆర్టీఐ కమిషనర్ల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. రూల్స్ పాటిస్తున్నామని ఉద్యోగి చెబుతుంటే వివక్ష చూపుతున్నారంటూ ఆర్టీఐ కమిషనర్లు వారిపై విరుచుకుపడ్డారు. సమాచార కమిషనర్ల తీరుపై మిగతా ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఈ విషయంతో పాటు, తమకు ఫర్నిచర్ ఇతర అంశాల విషయంలో సౌకర్యాలు కల్పించట్లేదంటూ కమిషనర్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యాలయంలో ప్రభుత్వ సూపరింటెండెంట్ ఉద్యోగితో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. ఈ అంశం గురించి తెలిసిన పలువురు దీన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ అధికారిపై ఆర్టీఐ కమిషనర్లు ప్రవర్తించిన తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.