జాతీయ రహదారి అండర్ బ్రిడ్జిలో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 12:37 PM IST
RTC Bus Stukked in Under Bridge: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని జాతీయ రహదారి వంతెన కింద ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు ఇరుక్కుపోయింది. వంతెన కింద ఇరుక్కు పోయి ఎటూ కదలకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రంలోని గుణుపూర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు గొట్టిపల్లి పైవంతెన వద్ద మలుపు తిప్పే క్రమంలో బస్సు పైభాగం పైవంతెనకు తాకి నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సు పైవంతెన వద్ద ఇరుక్కుపోవటంతో సుమారు గంటన్నర పాటు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పైవంతెన ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ఇరుక్కుపోయిన బస్సును బయటకు తీసేందుకు ప్రయాణికులు, స్థానికులు నానా ఇబ్బందులు పడ్డారు.
బస్సులోని ప్రయాణికులు బయటకు దిగి వెనక్కి ముందుుకు నెట్టేందుకు ప్రయత్నించినా ఎటూ కదలలేదు. శతవిధాలా ప్రయత్నించిన తర్వాత ప్రయాణికులు బస్సును వెనక్కి తోసేందుకు టైర్లలోని గాలిని తగ్గించారు. ఆ తర్వాత స్థానికులు, ప్రయాణికులు ఎట్టకేలకు బస్సును వెనక్కితోశారు. దీంతో బస్సు వంతెన కింద నుంచి బయటకు వచ్చింది.