'రోడ్డే' ప్రాణం తీసింది - ఏడేళ్ల బాలుడు మృతి- స్థానికుల ధర్నా - Road Accident in Vizianagaram - ROAD ACCIDENT IN VIZIANAGARAM
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 4:02 PM IST
Road Accident in Vizianagaram Boy Dead Villagers Protest : గుంతలతో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని జయప్రకాశ్ పాఠశాల వద్ద స్థానికులు ధర్నా చేశారు. పాఠశాల వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇవాళ ఉదయం పాఠశాలకు వెళ్తున్నఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో రోడ్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు నిరసనకు దిగారు. బాలుడిని ఢీ కొన్న వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రహదారిపై భారీ వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బేబినాయన.. రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద బాధితులకు సాయం చేస్తానన్నారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్థానికులు ధర్నా చేయడంతో రోడ్డుపైన ట్రాఫిక్ స్తంభించింది. ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో స్థానికులు ధర్నా విరమించారు.