రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోరుతూ పురందేశ్వరిని కలిసిన డీలర్లు - Ration Dealers Meet Purandeshwari
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 8:16 PM IST
Ration Dealers Meet BJP State President BJP Purandeshwari: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ మద్దతు కోరుతూ రేషన్ డీలర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షుడు మాధవరావు పురందేశ్వరికి అందజేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నా ప్రధాని ఫొటో కూడా మొబైల్ వ్యాన్‌పై డిస్ప్లే చేయడం లేదని అన్నారు.
కనీసం వ్యాన్‌పై కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యంగా ఎక్కడా ప్రజలకు తెలియని పరిస్ధితి ఉందన్నారు. మొబైల్ వ్యాన్‌పై 60 శాతం స్పేస్ కేటాయించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్తున్న బియ్యంగా ప్రచారం కల్పించాల్సిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రేషన్ డీలర్లు పేర్కొన్నారు. మొబైల్ బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా బీజేపీ సహకారాన్ని అర్ధిస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసామన్నారు.