బీరువాలో దాచిన నోట్లనూ వదలని ఎలుక- బాధిత రైతు లబోదిబో - Rat Bit Farmer Money in Beeruva

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 1:14 PM IST

thumbnail
బీరువాలో దాచిన నోట్లనూ వదలని ఎలుక- బాధిత రైతు లబోదిబో (ETV Bharat)

Rat Bit Farmer Money in Beeruva Almirah : పంటపై దాడి చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగించే ఎలుకలు ఓ రైతుకు అంతులేని బాధను మిగిల్చాయి. ఏడాదంతా కష్టపడి సాగు చేసి పంటను అమ్మగా వచ్చిన డబ్బులను అతడికి దక్కకుండా చేశాయి. ఎంతో భద్రంగా బీరువాలో దాచుకున్నా ఓ ఎలుక దాడి చేసి నోట్లు కొరికేసింది.  

ఓ రైతు బీరువాలో దాచుకున్న డబ్బును ఎలుక కొరికేసింది. దీంతో ఆ రైతు లబోదిబోమంటున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగింది. ఎలుక కొరికిన నగదును మార్చుకోవాలని బ్యాంక్ అధికారులకు బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నాడు.  

వివరాలివి: జిల్లాలోని జి మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ ఎగరాపల్లికి చెందిన రైతు రామారావు నెల రోజుల కిందట పసుపు పంట అమ్మగా 35వేల రూపాయలు వచ్చాయి. ఆ నగదును బీరువాలో దాచుకున్నాడు. అవసరం నిమిత్తం ఇవాళ బీరువా తెరిచి చూసేసరికి డబ్బును ఎలుక కొరికేసింది. నోట్ల కట్ట నాశనమవటంతో రైతు బోరున విలపిస్తున్నాడు. ఎలుక కొరకడం వల్ల పాడైపోయిన నోట్లు ఎలాగైనా మార్చాలని బ్యాంకువారిని అభ్యర్థించాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.