అద్భుతం - ఒకే చెట్టుకు విరబూసిన 20 బ్రహ్మ కమలాలు - 20 Brahma Kamalam Flowers at a Time

🎬 Watch Now: Feature Video

thumbnail

Rare Brahma Kamalam Flowers 20 Blooms at a Time  in Ambedkar Konaseema District : అరుదుగా కొన్ని జాతులకు చెందిన పూలు ఏడాది ఒకసారి మాత్రమే పూస్తాయి. అవి ఒకటి రెండు మాత్రమే. ఆ జాతికి చెందినదే బ్రహ్మ కమలం. ప్రతిఏటా జూన్ నెల ఆఖరిలో మాత్రమే పూసే ఈ పూలు వాతావరణంలో మార్పులు కారణంగా కొంచెం ఆలస్యంగా ఆగస్టు నెలలో పూస్తున్నాయి.కోనసీమ జిల్లా ముమ్మిడివరం పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెంలోని వెంకటేశ్వరరావు నివాసంలో ఒకేసారి 20 బ్రహ్మకమలం పువ్వులు పూయడంతో వారి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. నాలుగేళ్ల క్రితం విహారయాత్రకు కోసం అరకు వెళ్లిన కుటుంబసభ్యులు అక్కడి నుంచి మెుక్కలు తీసుకొచ్చి పెరట్లో నాటారు.

అయితే గడిచిన రెండేళ్ల నుంచి ఒకటి, రెండు పూలు మాత్రమే పూసిందని యజమాని తెలిపారు. ఈ ఏడాది ఒకేరోజు 20 పూలు పూయడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మెుదటి నుంచి మెుక్కకు సరైన పోషకాలు అందిస్తున్నామని యజమాని తెలిపారు. చెట్టుకు వచ్చిన మెుగ్గలు రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. చుట్టుపక్కల మహిళలు పూలతో సెల్ఫీలు దిగుతూ వాటిని పట్టుకుని తన్మయం చెందారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.