LIVE: పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర- ప్రత్యక్షప్రసారం - puri jagannath rath yatra - PURI JAGANNATH RATH YATRA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 10:25 AM IST

Updated : Jul 7, 2024, 6:54 PM IST

Puri Jagannath Rath Yatra Live: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర ఘనంగా జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రలో సుమారు 15 లక్షలకు పైబడి భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగిన ఏర్పాట్లను చేస్తూ, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. మొట్టమొదటసారిగా ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఆమె గవర్నర్​ రఘుబర్​దాస్​తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్​ చరణ్​ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించనున్నారు. మూడు వేడుకలు ఆదివారం ఉండటంతో జగన్నాథుని నందిఘోష్​, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. అందుకే రెండు రోజులు సమయం.
Last Updated : Jul 7, 2024, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.