కోట్ల విలువైన సీఎస్‌ఐ ఆస్తులు కాజేస్తున్న బిషప్ - ప్రజాసంఘాలు ధర్నా - Public Protest to Protect CSI Lands - PUBLIC PROTEST TO PROTECT CSI LANDS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 4:55 PM IST
Public Associations Protest to Protect CSI Lands: కోట్ల రూపాయలు విలువచేసే కడప సీఎస్ఐ ఆస్తులను బిషప్ కాజేస్తున్నారంటూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. రాయలసీమలోని సీఎస్ఐ ఆస్తులను ఐజాక్ వరప్రసాద్ అనే బిషప్ కొల్లగొడుతున్నారని నేతలు ధ్వజమెత్తారు. కడప కోటిరెడ్డి కూడలి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బిషప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిషప్ అవినీతి అక్రమాలకు తావు లేకుండా పోయిందని ఎవరైనా ఫాదర్లు, చర్చి కమిటీ సభ్యులు ప్రశ్నిస్తే వారిని సంఘం నుంచి తొలగించడం ఫాదర్లను సస్పెండ్ చేయడం లాంటివి చేస్తున్నారని అన్నారు. ప్రవేట్ వ్యక్తులకు ఆస్తులను ధారా దత్తం చేస్తున్నారని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నుంచి సీఎస్ఐ ఉందని దాని ముఖ్య ఉద్దేశం పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడంతోపాటు వారికి కావలసిన సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతోనే ఉందని తెలిపారు. కానీ ప్రస్తుతం ఉన్న బిషప్ సీఎస్ఐ ఆస్తులను తన సొంత ఆస్తులుగా పరిగణిస్తూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నాడని, లీజుకి ఇస్తున్నాడని విమర్శించారు. బిషప్ అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.