బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బిగ్ షాక్ - టీడీపీలో చేరిన డోన్ మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ - BIG SHOCK TO BUGGANA - BIG SHOCK TO BUGGANA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 10:10 AM IST
Doan Market Yard Chairman Joined in TDP : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నియోజకవర్గంలో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన డోన్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాజా నారాయణ మూర్తి పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజా నారాయణ మూర్తి నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందినవారు. ఆయనకు ఆర్థిక మంత్రి డోన్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి అధిష్ఠానం టికెట్ ఇవ్వడంతో ఆయనపై ఉన్న అభిమానంతో పార్టీలోకి వచ్చారు. డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, వీరి కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఆయనతో పాటు దాదాపు 100 మందిని పార్టీలో చేర్పించారు.
Protest Against Buggana Rajendranath Son: మరోవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తండ్రి గెలుపు కోసం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రచారం సాగిన్న క్రమంలో మహిళలు నీళ్లు పట్టుకుంటుండగా వారి దగ్గరకు వెళ్లారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నా ఇన్నాళ్లూ పట్టించుకున్న పాపానే పోలేదని, ఇప్పుడు మాత్రం ఓట్లు అడగటానికి వచ్చారంటూ ఓ మహిళ నిలదీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషన్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.