ఎయిమ్స్​ ఆసుపత్రిని వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి మోదీ - సభ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు - Narendra Modi Opening of AIIMS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 8:15 PM IST

Prime Minister Narendra Modi Opening Arrangements of AIIMS Hospital in Guntur District : గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రతిష్థాత్మకంగా నిర్మించిన ఎయిమ్స్​ ఆసుపత్రిని ఈ నెల 25న ( ఫిబ్రవరి 25న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్ఛువల్​ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను జిల్లా అధికారులు పరిశీలించారు. సభకు హాజరు అయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్ల చేయాలని జిల్లా కలెక్టర్​ అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమానికి సుమారు పదివేల మంది దాకా ప్రజలు హాజరు కానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సభకు గవర్నర్​ అబ్దుల్​ నజీర్​, కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, భారతి ప్రవీణ్​ పరిహర్​, ఇతర మంత్రులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులను దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రి వర్గాలు భారీగా ఏర్పాట్ల చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్​ వేణుగోపాల్​ రెడ్డి, ఎస్పీ తుషార్​, వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్​ నివాస్​ పరిశీలించారు. ఆదివారం ఉదయం లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.