పెద్ద గంగాళమే ఆ గర్బిణీని గట్టెక్కించింది - pregnant troubles to cross canal - PREGNANT TROUBLES TO CROSS CANAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 6:07 PM IST
Pregnant Woman Crossed Brook in Big Gangalam At Alluri District : అధునాతన టెక్నాలజీతో హైటెక్ ప్రపంచం ఓ వైపు కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ఓ వైపు. ఇదీ నేటి సమాజ స్థితి. కనీసం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న గర్బినిని ఆస్పత్రికి తరలించడానికి ఆమె కుటుంబీకులు ప్రాణాలకు తెగించి ప్రమాదకరంగా వాగు దాటిన ఘటన ఆందోళక కలిగిస్తుంది.
వరదల్లో రహదారి మునగడంతో వాగులో గర్భిణిని మోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పెదబయలు మండలం గుంజివాడ గడ్డలో పురిటి నొప్పులతో బాధపడుతున్న రాజేశ్వరిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు సాహసం చేశారు. గర్భిణిని పెద్ద గంగాళంలో మోసుకుంటూ వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లారు. వర్షాకాలం వస్తే అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న జామిగూడ, గిన్నెలకోట వంతెనలు పూర్తిచేసి రహదారి కష్టాలు కడతేర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.