తిరుమలలో శ్రీవారికి వైభవంగా పౌర్ణమి గరుడ సేవ - Pournami Garuda Seva in Tirumala - POURNAMI GARUDA SEVA IN TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 8:54 AM IST
Pournami Garuda Seva in Tirumala : తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి గరుడ సేవను టీటీడీ వైభవంగా నిర్వహించింది. అర్చకులు స్వామి వారి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా దీనిని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాభరణ అలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
పెద్ద ఎత్తున భక్తులు గ్యాలరీల్లోకి చేరుకొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, తిరుపతి జిల్లా పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. గరుడవాహనం ద్వారా ఆ అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన స్వామివారు తాను దాసుదాస ప్రపత్తికి దాసుడని తెలియజేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు, జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే వారి సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి విశ్వాసం.