'గిరిజన మహిళా చైర్‌పర్సన్‌ను కులం పేరిట దూషిస్తారా?- మేకపాటి రాజమోహన్‌రెడ్డిని అరెస్టు చేయాలి' - MEKAPATI Arrest Demand - MEKAPATI ARREST DEMAND
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 7:08 PM IST
Potluri Srinivasulu Fire on Mekapati Rajamohan Reddy : నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ వెంకటరమణమ్మను గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాసులు పరామర్శించారు. వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆమెను కులం పేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటివలే వెంకటరమణమ్మ వైసీపీలో సరైన గౌరవం లేదంటూ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. దీంతో ఆమెపై అక్కసుతోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి కులం పేరుతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఒక గిరిజన మహిళను కులం పేరుతో దూషించటం సరైన పద్ధతి కాదని తెలిపారు. అలాగే వెంకటరమణమ్మను ఉద్దేశించి రూపాయి నెత్తిన పెడితే ఐదు పైసలకు కూడా అమ్ముడుపోదంటూ మేకపాటి రాజమోహన్ అసభ్యకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
పేదవాడు చిన్నతప్పు చేస్తే తీవ్రంగా స్పందిచే పోలీసులు మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఉన్న గిరిజన మహిళను ఇంత నీచంగా దూసిస్తుంటే మేకపాటి రాజమోహన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి కొమ్ముకాస్తూ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోలీస్ స్టేషన్ ముందు గిరిజన సంఘాలతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని పొట్లూరి శ్రీనివాసులు హెచ్చరించారు.