వికలాంగులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి: అఖిల భారత వికలాంగుల సంఘం - Disabled People in Politics

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 7:55 PM IST

Political Priority Should Given to Disabled People: వికలాంగులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రామదాసు డిమాండ్ చేశారు. చట్ట సభల్లో తమకు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగులుగా ఉన్న తమను దివ్యాంగులుగా మార్చిన ప్రధాని మోదీకి వారు ధన్యవాదాలు తెలిపారు. 

Round Table Meeting at Vijayawada: అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్, ఇతర సమస్యలపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యల అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి నేటికి 75 ఏళ్లు గడుస్తున్నా తమ పరిస్థితి అలానే ఉందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 6 కోట్ల మంది వికలాంగులు ఉన్నా వారికి రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీలు కల్పించలేదని అవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.