కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలింపు - 24 బాక్సులు స్వాధీనం - Police Seized Liquor Bottles - POLICE SEIZED LIQUOR BOTTLES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 12:11 PM IST
Police Seized the Karnataka Liquor: ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాయంపల్లి శివారులో నాలుగు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా రాయదుర్గం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అడ్డుకున్నారు. సెబ్ అధికారులను గమనించిన నిందితులు వాహనాలను వదిలి పరారైయ్యారు. మొత్తం 24 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుల్లో ఒకరిని గుర్తించినట్లు స్పెషల్ బ్రాంచ్ సీఐ రఘు తెలిపారు. అక్రమ మద్యం తరలింపునకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం, నగదు తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ దాడుల్లో అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ రఘు తదితర సిబ్బంది పాల్గొన్నారు.