జోజినగర్ గోదాములో అనుమానాస్పద నిల్వలు- పోలీసుల దాడుల్లో భారీగా నకిలీ సిగరెట్ల పట్టివేత - Police Seized Fake Cigarettes - POLICE SEIZED FAKE CIGARETTES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 1:00 PM IST
|Updated : May 3, 2024, 1:32 PM IST
Police Seized Fake Cigarettes in Vijayawada : భవానీపురం జోజినగర్ ప్రాంతంలోని ఓ గోదాములో భారీ స్థాయిలో నకిలీ సిగరెట్లను విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో గోదాములో అనుమానాస్పద వస్తువులతోపాటు మద్యం, డబ్బులు దాచి ఉంచినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో వివిధ పార్టీల నాయకులు అక్కడకు చేరుకున్నారు. గోదాము షటర్లు తీయాలంటూ డిమాండ్ చేశారు. అయితే షట్టర్లు తాళాలు వేసి ఉండటంతో ఆలస్యమైంది. ఆ తర్వాత అధికారులు షట్టర్లు తీసి చూడగా నకిలీ సిగరెట్లుగా తేలింది. దీంతో నాయకులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఎన్నికల వేళ మద్యం నుంచి గంజాయి అధిక మొత్తంలో పట్టుబడుతున్నాయి. కేవలం ఇవే కాకుండా భారీ ఎత్తులో నగదు సైతం పట్టుబడుతుండటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల తనిఖీల్లో పలువురు నాయకులు ప్రజలకు తాయిలాలు అందించడానికి తీసుకొచ్చిన సామగ్రి సైతం దొరకడం గమనార్హం. ఎన్నికల వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదని అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.