వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్స్ - Police Rescue Drowning Man in Flood
🎬 Watch Now: Feature Video
Published : Sep 1, 2024, 4:09 PM IST
Police Rescue Drowning Man in Flood : నాగర్ కర్నూల్ పరిధిలోని నాగనూలు ఊరు చెరువు వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోతుండడంతో పోలీసులు రక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఊర చెరువు అలుగు పారుతూ నాగనూలు ప్రధాన రహదారిపై పొంగిపొర్లుతోంది. కల్వర్టు పైనుంచి రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రహదారులపై ప్రవహిస్తున్న వాగుల వద్ద ముందుగానే పోలీసు యంత్రాగం బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే వరద ఉద్ధృతి అంచనా వేయకుండా ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా భారీ వరద ధాటికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ పోలీస్ కానిస్టేబుళ్లు రాము, తఖిఖాన్లు వరదలోకి దిగి రక్షించారు. ఇరువురు కానిస్టేబుళ్లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కొట్టుకుపోతున్న వ్యక్తికి చేయి అందించారు. ఇలా అతడిని చాకచక్యంగా పైకి లాగి వరద నుంచి కాపాడారు. పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి వ్యక్తిని కాపాడడంతో స్థానికులు పోలీసుల సాహసాన్ని అభినందించారు. వరద ప్రవాహం లెక్కచేయకుండా కానిస్టేబుల్స్ సాహసోపేతంగా ఓ వ్యక్తిని కాపాడడం, ఈ వీడియోలు వైరల్‌గా మారింది.