సత్ఫలితాలిస్తున్న 'మొబైల్ హంట్' - వాట్సప్​లో మెసేజ్ చేస్తే మిస్సైన మీ ఫోన్​ ఎక్కడున్నా దొరికే ఛాన్స్​ - Police Recovery Was Stolen Phones - POLICE RECOVERY WAS STOLEN PHONES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 10:04 AM IST

Police Recovery Was Stolen Phones in Nellore District: నెల్లూరు జిల్లాలో సుమారు కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే 600 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన ఈ ఫోన్లను మొబైల్ హంట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఆ జిల్లాల ఎస్పీ ఆరిఫ్ హపీజ్ తెలిపారు. ఇప్పటివరకు ఆరు విడతల్లో 5 కోట్ల 85 లక్షల రూపాయలు విలువ చేసే 2 వేల 320 ఫోన్​లను రికవరీ చేశామని తెలిపారు. మొబైల్ హంట్ సేవలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. 

మొబైల్‌ హంట్‌తో  (Mobile Hunt) పాటు సీఈఐఆర్‌ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్​కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం వాట్సప్​లో మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తే ఫోన్లు రికవరీ చేసే బాధ్యత తాము తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. పోగొట్టుకున్న తమ మొబైల్‌ ఫోన్లను గుర్తించి అప్పగించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సెల్​ఫోన్లు రికవరీ కోసం శ్రమించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.