వైఎస్సార్సీపీ అయితే వదిలేస్తారా? - కర్ణాటక మద్యం తరలింపు కేసులో పోలీసుల ఉదాసీనత - YSRCP Leaders Illegal Liquor

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 2:20 PM IST

Police Left YSRCP Sarpanch : రాష్ట్రంలో అక్రమంగా మద్యాన్ని తరలించడం, అమ్మడం వంటివి చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. అనంతపురం జిల్లాలో మాత్రం వైఎస్సార్సీపీ నాయకులు దొరికినా అరెస్టులు, రిమాండ్లులు ఏమీ లేకుండా నిందితుడిని వదిలేస్తారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు,

YSRCP Sarpanch Transporting Karnataka Liquor : జిల్లాలోని వజ్రకరూరు మండలం చాబాల సర్పంచి వైఎస్సార్సీపీ జగదీష్, అదే గ్రామానికి చెందిన ఓబులేసు జనవరి 30న కర్ణాటకలోని బళ్లారి నుంచి ద్విచక్ర వాహనంలో మద్యం తరలిస్తున్నారు. విడపనకల్లు మండలం హావళిగి చెక్ పోస్ట్ వద్ద సెబ్ అధికారులు తనిఖీ చేసి వీరిని పట్టుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఉరవకొండ సెబ్ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశారు. రెండు ఆట్టపెట్టెల్లో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్సీపీ సర్పంచి కీలక మాజీ ప్రజాప్రతినిధితో పోలీసులకు ఫోన్ చేసి తనను వదిలేయమని ఒత్తిడి చేశారు. తమ గ్రామంలో జాతర ఉందని, మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి లొంగిపోతానని చెప్పగా పోలీసులు అతడిని, అనుచరుడిని వదిలేశారు. ఇదే అదనుగా భావించిన సర్పంచి చరవాణిని స్విచ్ ఆఫ్ చేసి పరారీ అయ్యాడు. నిబంధనల మేరకు చూస్తే సెబ్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి, రిమాండ్​కు తరలించాలి.

Karnataka liquor in Anantapur District : నిందితుడు వైఎస్సార్సీపీ సర్పంచి కావడంతోనే వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెబ్​లోని కొందరు పోలీసులు అతడి బెయిల్ విషయంలోనూ సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడు ఎక్కడ ఉన్నాడో సెబ్ అధికారులకు పక్కాగా తెలుసని, మాజీ ప్రజాప్రతినిధికి భయపడి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఉరవకొండ సెబ్ సీఐ కిశోర్ వివరణ కోరగా అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎందుకు వదిపెట్టారనే దానికి మాత్రం సమాధానమివ్వలేదు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.