సాంబశివరావుకు 41ఏ నోటీసులు- 22న విచారణకు రావాలన్న పోలీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 1:19 PM IST

Police Issued 41A Notice to TDP MLA Eluri Sambasivarao: మైనింగ్ అధికారుల విధులు అడ్డుకున్నారంటూ బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఇసుక దర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో మార్టూరు పోలీసులు ఏలూరి సాంబశివరావుకు నోటీసులు అందజేశారు. గత నెల 30న మార్టూరు-నాగరాజుపల్లి రోడ్డులోని అనంత గ్రానైట్‌ వద్ద తాను విధులు నిర్వహిస్తుండగా కొందరు అడ్డుకున్నారని విజిలెన్సు మైనింగ్‌ అధికారి బాలాజీనాయక్‌ ఫిర్యాదు చేయడంతో ఏ8 నిందితుడిగా ఎమ్మెల్యే ఏలూరిని ఇందులో చేర్చారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల అండతోనే అక్రమంగా తనపై కేసులు నమోదు చేశారని 41ఏ నోటీసు (41A Notice) ఇవ్వకుండా పోలీసులు అరెస్టుకు ప్రయత్నిస్తున్నారని ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పోలీసులను నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చెయ్యకూడదని హైకోర్టు హెచ్ఛరించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసు ఇచ్చి ఈనెల 22న విచారణకు హాజరుకావాలని సూచించారు.

అసలు ఏం జరిగిందంటే : పర్చూరు నియోజకవర్గం పరిధిలో తప్పుడు ఫారం7 దాఖలు చేసి భారీగా ఓట్లను తొలగించిన వ్యవహారంపై ఎమ్మెల్యే హైకోర్టులో వ్యాజ్యం వేశారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరపిందన్నారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు సస్పెండ్‌ (Police suspended) కూడా అయ్యారని తెలిపారు. ఈ కారణంగా పిటిషనర్‌పై కక్షపూరితంగా తప్పుడు కేసు పెట్టారని పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవన్నారు. నేర ఘటన తీవ్రత తక్కువైనందున ముందస్తు బెయిలు మంజూరు చేయాలని లేదా 41ఏ నిబంధనలను పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.