చైన్‌స్నాచింగ్‌లు, ఇళ్లల్లో చోరీలు- జల్సాలు- ఇప్పుడేమో కటకటాలు - Police Arrested 3 Chain Snatchers - POLICE ARRESTED 3 CHAIN SNATCHERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 11:01 AM IST

Police Arrested  Three Chain Snatchers in Mangalagiri : మంగళగిరిలో  చైన్‌స్నాచింగ్‌, ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న  ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 81 గ్రాముల బంగారం, 42 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  జల్సాలకు అలవాటుపడిన యువకులు దుర్గేష్, సురేష్, కిరణ్​లు ఈ చోరీలకు పాల్పడ్డారని అదనపు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. నిందితులపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 80 పైగా కేసులున్నాయన్నారు. మంగళగిరిలో వరస గొలుసు దొంగతనాలు జరగడంతో గస్తీలను ముమ్మరం చేసినట్లు వివరించారు.  

మంగళగిరిలో దొంగతనం చేసిన వ్యక్తి ఇటీవల పలు జిల్లాల్లో చైన్ స్నాచింగ్​ చేశాడని ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇక నుంచి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని పోలీసులు తెలిపారు. అనుమాస్పదంగా ఎవరైనా తిరిగినట్టు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని  సూచించారు. అందరు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వరస దొంగతనాల ఘటనలతో భయపడుతున్న జనాలకు భరోసా కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.