ఏపీలో రూ. 613 కోట్లతో రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు - railway projects
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 9:54 PM IST
PM Modi virtually launches railway development projects: రాష్ట్ర వ్యాప్తంగా 34 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. 613కోట్ల 30 లక్షల వ్యయంతో రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రైల్వే ట్రాక్ పెంపు, నూతన భవనాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు తదితర నిర్మాణాలు చేసి, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు. విజయవాడలోని గుణదల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. ఈ స్టేషన్‌ను 14 కోట్ల రూపాయలతో శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ది పరుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ది చేస్తున్నారు. ఏపీలో 34 రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తుండగా, రాజమహేంద్రవరం స్టేషన్‌ను 214 కోట్ల రూపాయలతో ఆధునికీకరించనున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసిందని రైల్వే అధికారులు వెల్లడించారు. విజయవాడ - విశాఖ మధ్య నూతనంగా రెండు రైల్వే ట్రాక్‌లను మంజూరు చేశారని, వాటి పనులు త్వరలో ప్రారంభిస్తామని విజయవాడ డీఆర్ఎం నరేంద్ర తెలిపారు.