నెల్లూరు జిల్లాలో చిరుత సంచారం- మేకను చంపిన ఆనవాళ్లు - CHEETAH MIGRATION - CHEETAH MIGRATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 6:45 PM IST
Cheetah Migration in Durgampally Forest Area: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దుర్గంపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి ఉదయగిరి ఎంజీఆర్ వ్యవసాయ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు అడుగులు గుర్తించారు. గురువారం రాత్రి మంద నుంచి తప్పిపోయిన మేకపై చిరుత దాడి చేసి చంపిన ఆనవాళ్లను ప్రజలు గుర్తించారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నాలుగు రోజుల క్రితం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. కారు వేగంగా వస్తుండటంతో పులిని ఈడ్చుకెళ్లడంతో దాని కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పులి పారిపోయిందని డ్రైవర్ అన్నారు. పులి ఆచూకీ కోసం డ్రోన్‌తో అడవిని అధికారులు జల్లెడ పట్టారు. 2-3 కిలోమీటర్ల పరిధిలో గాలించినా పులి ఆచూకీ దొరకలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో కొన్ని ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపామని అధికారులు తెలిపారు.