కూటమి విజయానికి అందరూ కృషి చేయాలి: నాడెండ్ల మనోహర్ - Tdp Election Office inauguration - TDP ELECTION OFFICE INAUGURATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 1:50 PM IST
Pemmasani Chandrasekhar Inaugurated Tdp Election Office With Nadendla Manohar: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కి పోయిందని గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి (Guntur MP Candidate) పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రకృతి వనరులను అధికార పార్టీ పూర్తిగా దోచేస్తుందని, మరోసారి తప్పు జరిగితే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ప్రజలను పెమ్మసాని అప్రమత్తం చేసారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ జనసేన తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ప్రారంభించారు.
వైఎస్సార్సీపీ నేతలు అర్చకులు పైనా దాడి చేసే పరిస్థితికి వెళ్లారని, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి కాపాడతారనే వైఎస్సార్సీపీ పార్టీ నేతలు తెగించారని పెమ్మసాని దుయ్యబట్టారు. పట్టిసీమ పూర్తి చేయడం వల్లే కృష్ణా డెల్టాకు సాగు నీరు అందుతోందని, వైఎస్సార్సీపీ ఐదేళ్లలో కనీసం కాలువలు కూడా బాగు చేయించలేకపోయిందని విమర్శించారు. తెనాలి సమగ్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.