నియోజకవర్గ ఇన్​చార్జిలతో పవన్​ సమావేశం- పొత్తులు, పోటీపై స్పష్టత! - pawan kalyan

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 3:44 PM IST

Pawan Kalyan meet with Janasena leaders : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. రాత్రి రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్ (Shelton Hotel)లో బస చేసిన పవన్ కొద్దిసేపటి క్రితం ఏవీ అప్పారావు రోడ్ లోని జనసేన పార్లమెంటరీ కార్యాలయానికి చేరుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జిలతో పవన్ సమావేశమయ్యారు. రాజానగరం నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన పొత్తు (Telugu Desam and Jana Sena alliance) లో భాగంగా రాజమహేంద్రవరంలో గ్రామీణ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేసే అంశంపైనా సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే వైఎస్సార్సీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ- జనసేన కలిసి క్షేత్ర స్థాయిలో ఎన్నికల్ని ఎదుర్కొనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

గజమాలతో ఘనస్వాగతం : రాజమండ్రిలో సమావేశం నేపథ్యంలో పవన్​ సోమవారమే ఇక్కడకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కు జనసేన నేతలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ అవరణలో జనసైనికులు అధిక సంఖ్యలో చేరుకుని నినాదాలు హోరెత్తించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.