LIVE: మండపేట వారాహి విజయభేరిలో పవన్‌ కల్యాణ్‌ - ప్రత్యక్షప్రసారం - Pawan Kalyan live - PAWAN KALYAN LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 12:35 PM IST

Updated : May 1, 2024, 1:01 PM IST

Pawan Kalyan Varahi Vijayabheri Sabha Live in Mandapeta : రాష్ట్రప్రజల కోసం తానొక కూలీలా పని చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. వైఎస్సార్సీపీ ఒక అరటి పండు తొక్క ప్రభుత్వమనని ఎద్దేవా చేశారు. యువతకు దిశానిర్దేశం చేసి వారిలో ఉన్న శక్తిని బయటకు తీస్తామని హామీ ఇచ్చారు. సగటు మనిషి గొంతును అసెంబ్లీలో వినిపిస్తానని ప్రజలకు పవన్‌ భరోసానిచ్చారు. రోడ్లు బాగు చేసి సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. పోలవరం కాల్వల మట్టిని వైఎస్సార్సీపీ నాయకులు దోచేస్తున్నారని పవన్‌ ధ్వజమెత్తారు. కాల్వ గట్లను సైతం వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా జలవనరులశాఖ ఏం చేయలేకపోతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు వందల ఎకరాల్లో చెరువులు కబ్జా చేశారన్న పవన్‌ కొండను కూడా మిగలకుండా చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వారాహి విజయ భేరి సభలో ప్రసంగించారు. ప్రస్తుతం మండపేట వారాహి విజయభేరిలో పవన్ కల్యాణ్‌ ప్రసంగిస్తున్నారు - ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 1, 2024, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.