దేశంలో ఆర్థిక విధ్వంసం- దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల వేధింపులు : పరకాల ప్రభాకర్ - Parakala Prabhakar Fires on BJP - PARAKALA PRABHAKAR FIRES ON BJP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 12:19 PM IST
Parakala Prabhakar Fires on BJP Government in Vijayawada : దేశంలో ప్రస్తుతం ఆర్థిక విధ్వంసం జరుగుతోందని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 'సంక్షోభంలో నవభారతం' ఆర్థిక రాజకీయ మూలాలు అనే అంశంపై విజయవాడలో (Vijayawada) జరిగిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. ఉపాధి కోసం పరాయి దేశంలో చచ్చిపోయేందుకు సైతం నిరుద్యోగులు సిద్ధపడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై బీజేపీ (BJP) విరుచుకుపడుతోందని ఆరోపించారు.
'అడ్డగోలుగా రైడ్స్ జరిపించడం ద్వారా, పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చిన వారి దగ్గర నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీ డబ్బు గడించింది. ఈ అతి పెద్ద ఆర్థిక కుంభకోణాన్ని మోదీ గేట్ అనొచ్చు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుంది. ఈ దేశంలో 24 శాతం యువతీ, యువకులు నిరుద్యోగులుగా ఉండటం దారుణం.' - రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్