అధికారంలోకి కూటమి - పల్నాడు జిల్లా వాసుల తిరుమల పాదయాత్ర - TDP Leaders to Piligrimage Tirumala - TDP LEADERS TO PILIGRIMAGE TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 3:38 PM IST
Palnadu District TDP Leaders Going to Piligrimage Tirumala : అరాచక వైఎస్సార్సీపీ పాలన పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పల్నాడు జిల్లా వినుకొండ మండలం కొత్తపాలెం వాసులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వారి యాత్ర నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వద్దకు చేరుకుంది. జగన్ పాలన పోయి చంద్రబాబు పాలన రావాలని కొత్తపాలెంలోని 20 మంది తెలుగుదేశం నాయకులు శ్రీవారికి మెుక్కుకున్నారు. వారంతా ఈ నెల 23న తిరుమలకు కాలినడకన బయలుదేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డామని ప్రజలు పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ నేతలు అధికారంలో ఉండి తమ పొలాలు ఆన్‌లైన్‌లో లేకుండా చేసి చాలా ఇబ్బందులకు గురి చేశారని బాధితులు వాపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నామని వారు తెలిపారు. ఈ పాదయాత్రలో యువకులతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు. ఇప్పటికే అమరావతి రైతులు కూడా మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని రైతులు తెలిపారు.