టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది - కార్యకర్తలకు సముచిత స్థానం : పల్లా శ్రీనివాసరావు - Palla Srinivasa Rao on TDP - PALLA SRINIVASA RAO ON TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 5:03 PM IST
Palla Srinivasa Rao Charge in TDP President : మళ్లీ 2029లో భారీ మెజార్టీతో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తానని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావుకు మంత్రి లోకేశ్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బడేటి చంటి, శ్రావణ్, కొండయ్య యాదవ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ ముఖ్య నేతలు శుభాకాంక్షలు చెప్పారు.
తనకు ఈ బాధ్యతలు అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన క్యాడర్ ఉందన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తానని పేర్కొన్నారు. వారిని ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పని చేస్తానని చెప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్ని కొట్టివేయిస్తామన్నారు. శ్రేణులకు అండగా ఉంటానని పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.