"పాలధార పొంగినట్టుగా పాలకొండ జలపాతం" - చూసేందుకు ఎగబడుతున్న జనం - PALAKONDA WATERFALL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2024, 7:18 PM IST
Palakonda Waterfall Overflows in Kadapa : కడపలోని పాలకొండ జలపాతం ఆకట్టుకుంటోంది. అల్పపీడన ప్రభావంతో కడప జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ మేరకు కడప శివారులోని పాలకొండలలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వర్షం నీరు దిగువ ప్రాంతానికి రావడంతో అక్కడ ఉన్న జలపాతం అందరిని ఆకట్టుకుంది. జలపాతాన్ని చూసేందుకు నగర వాసులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారు. అటవీ ప్రాంతం మధ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రం భయపడకుండా కుటుంబ సభ్యులతో కలిసి జలపాతంలో చూసేందుకు, సరదాగా అక్కడ గడిపేందుకు వెళ్తున్నారు. పైనుంచి వర్షం నీరు ధారలా పారుతుంటే ఆ దృశ్యం చూసేందుకు ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్ల మధ్య జలపాతం వంపు సొంపులుగా జారుతోంది. చిన్నారులు జలపాతం కింద కూర్చొని సరదాగా గడిపుతున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో సంతోషంగా జలపాతం వద్ద గడుపుతున్నారు. పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంత సందడిగా మారింది.