భళా అనిపించిన ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు - ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 1:14 PM IST

Updated : Jan 31, 2024, 1:25 PM IST

Ongole Bull Competitions at Yemmiganur of Kurnool District : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడు రోజులుగా జరగుతున్న (Ongole Bull Competitions) ఒంగోలు జాతి ఎద్దుల బండ లాగుడు పోటీలు ముగిశాయి. నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన బండ లాగుడు పోటీల్లో రాష్ట్రంలోని ఒంగోలు జాతి ఎద్దులు పాల్గొని బలప్రదర్శన చేశాయి. విజయం సాధించిన వృషభాలకు బహుమతులను అందజేశారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ప్రజలు, ఎద్దుల యజమానులు పోటీలు చూసి కేకలు చేస్తూ ఎద్దులను (Bulls) ఉత్సాహపరుస్తూ బండ లాగుడు పోటీలను కోలాహలంగా నిర్వహించారు. 

ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్యదైవం నీలకంఠేశ్వరస్వామి మహారథోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మేరకు ఉత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు, ఆలయ నిర్వాహకులు పూర్తి చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలు మూలల నుంచే కాక తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. 

Last Updated : Jan 31, 2024, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.