మరో డయేరియా మరణం - భయాందోళనలో ప్రజలు - Old Man Died With Diarrhea - OLD MAN DIED WITH DIARRHEA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 1:00 PM IST
Old Man Died With Diarrhea In Anantapur District : రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ డయేరియా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమూష్టరులో డయేరియాతో కురుబ నాగేంద్ర అనే వృద్ధుడు మృతి చెందారు. మంగళవారం నుంచి వాంతులు, విరేచనాలతో నాగేంద్ర బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఇవాళ తెల్లవారుజామున ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వర్షాకాలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరించడం వల్లే నేడు డయేరియా విజృంభిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ గిరిజన గృహంలో 21 మంది విద్యార్ధులు డయేరియా బారిన పడ్డ సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారులు డయేరియా నివారణ దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.