కలెక్టరేట్​లో వృద్దుడి వద్ద కత్తి- ఉలిక్కిపడ్డ అధికారులు - Old Man in Collectorate With knife - OLD MAN IN COLLECTORATE WITH KNIFE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 4:43 PM IST

Old Man Came to the Collectorate With knife in Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్​లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (Public Grievance Redressal System) ఓ వృద్దుడి వద్ద కత్తి ఉండటం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ చేతన్​ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ క్రమంలో పాముదుర్తి పంచాయతీ చింతలయ్య గారి పల్లెకు చెందిన రామనారాయణ అనే వృద్ధుడు భూ తగాదాలకు సంబంధించి సమస్య గురించి కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. వినతి అందించడానికి వచ్చిన వృద్ధుడి వద్ద తనిఖీలో చాకు లభించింది.  

పోలీసులు రామనారాయణ నుంచి చాకును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కలెక్టరేట్​కి వచ్చిన ఫిర్యాదుదారులందరినీ ముమ్మురంగా తనిఖీలు చేశారు. పోలీసులు వృద్ధుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనతో ఒక్క సారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే భూ సంబంధిత సమస్య కాబట్టి ప్రత్యర్థులు దాడి చేసే అవకాశం ఉందని కత్తి వెంట తెచ్చుకున్నాని వృద్దుడు తెలిపినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.