ప్రజాసామ్యంలో కలకలం- అరకు లోక్సభ స్థానంలో 50వేలకు పైగా నోటా ఓట్లు! - Nota votes in araku lok sabha constituency - NOTA VOTES IN ARAKU LOK SABHA CONSTITUENCY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 4:08 PM IST
Nota Votes in Araku Lok Sabha Constituency : దేశంలో నోటా ఓట్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగడంపై ప్రజాసామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నోటా ఓట్లు ఎక్కువగా పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో రాష్ట్రంలోని అరకు లోక్ సభ స్థానంలో ఏకంగా 50,470 'నోటా' ఓట్లు పోలయ్యాయి. ఇవి పోలైన ఓట్లలో 4.33శాతం. నోటాకు అత్యధికంగా పోలైన ఓట్లలో మధ్యప్రదేశ్లోని ఇందౌర్ లోక్సభ స్థానం 2,18,674 నోటా ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా, రెండ స్థానంతో అరకు లోక్సభ స్థానం నిలిచింది. గిరిజనులకు ఈవీఎం మిషన్ల పనితీరుపై ఇప్పటికి అయోమయ పరిస్థతి నెలకొంది. గ్రామ పెద్దలు చెప్పిన గుర్తుకే ఓటు వేయాల్సిన దుస్థితి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక విధంగా ఓటింగ్ జరిగితే అరకులోయ మరో విధంగా ఓటింగ్ జరుగుతుంది.
దీన్ని బట్టి చూస్తే గిరిజనులకు ఈవీఎంలపై ఎంత మాత్రం అవగాహన ఉందో అర్థం అవుతుంది. అందువల్లనే దేశ వ్యాప్తంగా ఓ విధంగా ఓటింగ్ శాతం నమోదవుతుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మరో విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పోలైన నోటా ఓట్లను పరిశీలిస్తే రెండు, మూడు స్థానాల్లో అనకాపల్లి (26,235), శ్రీకాకుళం (24,605) లోక్సభ స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా విశాఖపట్నం లోక్ సభ స్థానానికి 5,313 నోటా ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో అత్యల్పంగా నోటా ఓట్లు పోలైన మొదటి అయిదు అసెంబ్లీ స్థానాలు, విశాఖ దక్షిణం (631), కర్నూలు (718), జగ్గయ్యపేట (773), చిలకలూరి పేట (788), మంగళగిరి (890) ఉన్నాయి.