అనపర్తిలో కూటమి నేతల ప్రచారం- హారతులతో స్వాగతం పలికిన మహిళలు - NDA Leaders Election Campaign - NDA LEADERS ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 6:39 PM IST
NDA Leaders Election Campaign in Anaparthi: ఎన్నికల ప్రచారంలో నేతలు దూకుడుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పురందేశ్వరి రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలోని రంగంపేట, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో రోడ్ షో సందర్భంగా ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. రంగంపేట మండలంలోని నల్లమిల్లి ఇంటి నుంచి ప్రారంభమైన యాత్ర బిక్కవోలు మండలంలోని పందలపాక వరకు సాగింది.
అనంతరం కొంకుదురు హారికరేవుల నుంచి పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ మీదుగా రామేశ్వరం వరకు రోడ్ షో కొనసాగింది. ప్రతి చోటా కూటమి నేతలకు మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. పలుచోట్ల గుమ్మడికాయలతో దిష్టి తీసి పూలతో స్వాగతం పలికారు. బిక్కవోలులో రామకృష్ణారెడ్డి, పురందేశ్వరిని కూటమి నేతలు భారీ గజమాలతో సత్కరించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కూటమి నేతలు అన్నారు.