LIVE: విజయవాడలో జాతీయ ఓటర్ల దినోత్సవం - ప్రత్యక్ష ప్రసారం - VOTERS DAY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 11:44 AM IST
|Updated : Jan 25, 2024, 12:17 PM IST
NATIONAL VOTERS DAY CELEBRATIONS: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం. నేతల తలరాతలు మార్చేది, ప్రజలకు నచ్చిన వ్యక్తికి పట్టం కట్టేదీ ఓటే. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సామాన్యుడి వజ్రాయుధం ఓటే. మనల్ని మనం పరిపాలించుకునే.. ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే సదావకాశం. అందుకే అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగాన్ని భారంగా కాకుండా బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి. నిజాయతీపరులు, దార్శనికులకు ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాలు వర్ధిల్లుతుంది. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో వేడుకలు నిర్వహిస్తున్నారు.
నేడు రాజకీయాల ప్రధాన లక్ష్యం ఎలాగైనా అధికారాన్ని పొందాలనేలా మారింది. ఆ క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతాల వారీగా విభేదాలు సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని, ప్రజా ప్రయోజనాన్ని పక్కనపెట్టి, అత్యధికులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక పెట్టుబడికి పదింతలు సంపాదించాలన్న వ్యక్తిగత స్వార్థంతో వ్యవహరిస్తున్న పరిస్థితి. దీంతో రాజకీయ నాయకులన్నా, ప్రజాప్రతినిధులన్నా ప్రజల్లో నానాటికి గౌరవభావం సన్నగిల్లుతోంది. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. ఇలాంటి ఉల్లంఘనలు ఎక్కడ జరిగినా యువజన సంఘాలు నిఘా వేయాలి. ఓటు లాంటిది మరొకటి లేదు.నేను తప్పక ఓటు వేస్తాను’’ అనే థీమ్‌ను ఈ ఏడాది ఓటర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. విజయవాడలో జరుగుతోన్న తీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం.