యువతతో నారా లోకేష్ ముఖాముఖి సభలు- ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన - Nara Lokesh Yuvagalam Padayatra - NARA LOKESH YUVAGALAM PADAYATRA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 10:34 PM IST
Nara Lokesh Yuvagalam Padayatra: ఈ ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ నెల 30 నుంచి మే 6 వరకు తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ఒంగోలులో ప్రారంభం కానున్న పర్యటన, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగనుంది. ఆయా ప్రాంతాల్లో నిర్వహించే సభలు, రోడ్‌షోల్లో లోకేశ్ పాల్గొంటారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో ముఖాముఖీ నిర్వహిస్తారు. వారి సందేహాలు నివృత్తి చేయడంతో పాటు జగన్ అరాచకాలపై ప్రజల్ని చైతన్యం చేయడం, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయే ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను వారికి వివరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ నిర్వహణ, నిరుద్యోగ యువతకు భృతి తదితర హామీలపై వారికి అవగాహన కల్పిస్తారు.