ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన నారా లోకేశ్ - Nara Lokesh election affidavit
🎬 Watch Now: Feature Video
Nara Lokesh election affidavit: ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎన్నికల అధికారికి తన ఎన్నికల ఆఫిడవిట్ సమర్పించారు. అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను తెలియజేశారు. గడచిన ఐదేళ్ల ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసుల వివరాలను తెలియజేశారు. ఇది ఇలా ఉంటే, ఇప్పటికే నారా లోకేశ్ తరపున 18వ తేదీన టీడీపీ, జనసేన, భాజపా నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజకుమారికి సమర్పించిన సంగతి తెలిసిందే. నామినేషన్ పత్రాల సమర్పణలోనూ లోకేశ్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఆయన తరఫున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులు ఉన్నారు.
మరోవైపు ఇండియా కూటమి తరుపున సీపీఎం బలపరిచిన శివశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. అతనితో పాటుగా మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి సోమవారం మొత్తం ఐదుగురు నామినేషన్ సమర్పించారని ఎన్నికల అధికారి రాజకుమారి తెలిపారు.