సొంత బాబాయ్‌నే చంపిన వారు- వేలు కోసుకుంటే స్పందిస్తారా: లోకేశ్ - Lokesh Reaction on Kovuru Lakshmi - LOKESH REACTION ON KOVURU LAKSHMI
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 7:49 PM IST
Nara Lokesh Reaction on Kovuru Lakshmi Cutting Her Finger: వైసీపీ అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మీకి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. లక్ష్మి వేలు కోసుకోవడంపై నారా లోకేశ్ స్పందించారు. సొంత బాబాయ్‌ని హతమార్చిన వారు మీరు వేలు కోసుకుంటే మాత్రం స్పందిస్తారా అని అన్నారు. వైసీపీ పాలనపై నిరసన తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని సూచించారు. ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. వైసీపీ అసుర పాలనను అంతం చేయడానికి కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. బాధితురాలు విడుదల చేసిన వీడియోను లోకేశ్ తన ఎక్స్ ఖాతకు జోడించారు.
వైసీపీని ఓటమి భయం వెంటాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. దారుణ పరాజయం తరుముకొస్తుంటే, తట్టుకోలేని వైసీపీ మూకలు టీడీపీ కార్యాలయాలపైనా, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టింది, పెదకూరపాడు మండలం తాళ్లూరులో తెలుగుదేశం పార్టీ ప్రచార రథం కళాకారులపై దాడి చేసింది వైసీపీ మూకలేనని ఆయన ఆరోపించారు. వైసీపీ అధికారమదం కొద్ది రోజుల్లో దింపుతామని లోకేశ్ హెచ్చరించారు.